టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు..

104
harish rao
- Advertisement -

సంగారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ రావు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..” ప్రజలు కాంగ్రెస్‌పై విశ్వాసం‌ కోల్పోయారు. ఆ పార్టీ ‌అధికారంలో‌ లేదు, భవిష్యత్తులో కూడా రాదు‌. అందుకే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు.. సీఎం కేసీఆర్‌పై విశ్వాసంతో టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశానికి దిక్సూచిగా మారిందని మంత్రి అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతీ గ్రామంలో డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, చెత్త సేకరణ వాహనాలు, ప్రకృతి వనాలు, ప్రతీ నెలా పల్లె ప్రగతి కింద నిధులను ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ ఆరేళ్ల పాలనలో జరుగుతోంది. పల్లెల్లో స్పష్టమైన మార్పు‌ కనిపిస్తుంది. పల్లెల్లో, పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ మార్పులు చూసే కాంగ్రెస్, బీజేపీల నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. సదాశివపేటలో 32 కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి.

సంగారెడ్డి, సదాశివపేట పట్టణాలకు పట్టణ ప్రగతి కింద ప్రతీ నెలా నిధులను ప్రభుత్వం ఇస్తోంది. రైతాంగానికి దేశంలో ఎక్కడా‌లేని విధంగా ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తోంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. సదాశివపేట బస్టాండ్ అభివృద్ధికి ఇటీవలే 20 లక్షల రూ. నిధులను విడుదల చేయడం జరిగింది. జిల్లా మంత్రిగా సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా.” అని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -