మణిపూర్‌లో చెలరేగిన హింసపై మాజీ జడ్జీతో ఒక కమిటీ వేస్తున్నట్టు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే మణిపూర్‌కు నూతన డిజీపీగా రాజీవ్ సింగ్‌ను నియమించారు. హోంశాఖ ఓఎస్డీగా పీ డొంగోల్‌ను నియమించారు. మణిపూర్‌లో చెలరేగుతున్న వర్గ పోరును దర్యాప్తు చేసేందుకు పలు ఎజెన్సీలు పనిచేస్తున్నాయని అన్నారు. ఆరు సంఘటనల్లో కుట్ర ఉన్నట్టు సీబీఐ ఉన్నత స్థాయి దర్యాప్తులో తెలిందని విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
నాలుగు రోజుల పర్యటన సందర్భంగా మణిపూర్ సంక్షోభాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్రం 5 లక్షలు, రాష్ట్రం 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మణిపూర్‌లో జరిగిన వర్గ హింసలో దాదాపు 40 మందికిపైగా మరణించారు. అల్లర్లలో గాయపడ్డవారికి చికిత్స అందించేందుకు 8 డాక్టర్ల బృందంలో ప్రస్తుతం మణిపూర్‌లో ఉన్నాయి. ఖోంగ్‌సాంగ్ రైల్వే స్టేషన్ వద్ద తాత్కాలిక ప్లాట్‌ఫామ్‌ను వేగంగా నిర్మిస్తున్నామని, దీన్ని వారంలోగా ఆపరేషన్ స్థాయికి తీసుకువస్తామన్నారు.
Also Read: బలపడుతున్న బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా పోటీకి సై
రేపటి నుంచి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఫేక్ న్యూస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొరారు. ఆయుధాలతో తిరుగుతున్నవారు పోలీసులకు అప్పగించాలని సూచించారు.
Also Read: బోనాలు..దేవాలయాలకు ఆర్ధిక సహాయం: తలసాని