ధరణితో భూ వివాదాలకు చెక్..

335
Amoy Kumar IAS
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న అర్బన్ ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాల ప్రక్రియను జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ నేడు బడంగ్ పెట్ మున్సిపాలిటీలో పరిశీలించారు. రంగారెడ్డి జిల్లాల్లో ధరణి పోర్టల్ ఆస్తుల నమోదు పక్రియను నిర్దేశిత సమయంలో పూర్తిచేసేందుకు గాను ఈ ఆస్తుల నమోదు ప్రక్రియను ఆకస్మికంగా తనికీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ నేడు బడంగ్ పెట్‌లో పరిశీలించిన సందర్బంగా స్థానికులతో మాట్లాడుతూ, తమ ఆస్తులకు సంబంధించి వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా మీ ఆస్తులకు పూర్తి స్థాయిలో భద్రత ఉంటుందని అన్నారు.

ఈ వివరాల పక్రియ పూర్తి అయిన అనంతరం పంచాయితీలు, మున్సిపాలిటీల్లో వ్యవసాయేతర ఆస్తులకు వేర్వేరుగా పాసు పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను పక్కాగా అందించి, సర్వే కు వచ్చే అధికారులు, సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -