చందాపూర్ రైతువేదిక రాష్ట్రానికే ఆదర్శం: నిరంజన్ రెడ్డి

121
niranjan reddy

చందాపూర్ గ్రామ రైతువేదిక రాష్ట్రానికి మోడల్‌గా నిలవాలన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. వనపర్తి మండలం చందాపూర్‌లో ప్రకృతివనం,వైకుంఠధామాల నిర్మాణాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి ….రాష్ట్రంలో పల్లె పల్లెనా ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి భావి తరాలకు సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణను బహుమతిగా అందిస్తున్నారని చెప్పారు. చందాపూర్ లో ఈ మూడు నిర్మాణాలకు ఎంచుకున్న వైకుంఠధామం, రైతువేదిక, ప్రకృతివనానికి సంబంధించిన 8.14 ఎకరాల భూమికి ఒకటే ఫెన్సింగ్ వేసి చెట్లను నాటాలని సూచించారు.

స్ధానికంగా వైకుంఠధామం, రైతువేదిక, ప్రకృతివనాల కోసం ఎంచుకున్న స్థలాలు ఎంతో బాగున్నాయని, ప్రకృతివనం నిర్మించిన తీరును అభినందించారు.
రాష్ట్ర స్థాయిలో ఈ మూడు నిర్మాణాలు ఉత్తమంగా నిలవాలని అధికారులను ఆదేశించారు.