“కో కో కోకిల” బాగానే పాడింది- మూవీ రివ్యూ

328
- Advertisement -

లైకా ప్రొడక్షన్స్ నిర్మాణం లో, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో , స్టార్ హీరోయిన్ నయనతార నటించిన చిత్రం ” కో కో కోకిల” .తమిళం లో మాసివ్ హిట్ అందుకున్న ఈ సినిమా నేడు తెలుగులో విడుదలై తెలుగు ప్రేక్షకుల ముందు తన శక్తిని పరీక్షించుకుంటోంది. తెలుగులో పూర్తి స్థాయి ప్రచారం జరుపుకోని ఈ చిత్రం ఎక్కువ అంచనాలు లేకుండానే విడుదలైందని చెప్పాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కోకిల (నయనతార) ఓ పేదకుటుంబానికి చెందిన అమ్మాయి. తన తల్లికి కాన్సర్ రావడంతో ఆపరేషన్ కు 15 లక్షలు కావాలి. అసలుకే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కోకిల కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతుంది. అప్పుడే కోకిల డ్రగ్స్ సరఫరాకి పూనుకుంటుంది. అసలు తాను డ్రగ్స్ ఎలా సరఫరా చేసింది. అసలు అవి ఏం డ్రగ్స్ . ఆ డ్రగ్స్ ని నయనతార సొంతగా సరఫరా చేసిందా . ఎవరైనా వెనకుండి సరఫరా చేయించారా, చివరికి తన తల్లి ని కాపాడుకుందా..అనేది కథ.

nayanthara

కథ మొత్తం నయనతార ఆర్ధిక సంక్షోభం మీదే తిరుగుతూ ఉంటే, నయనతార తన అభినయంతో, అందంతో సినిమాని తన చేతులతో నిలబెట్టింది. విలన్లని కొట్టి చంపలేకపోయినా తన అమాయకత్వంతో అంతం చేసే సీన్లు సినిమాకి తలమానికంగా నిలుస్తాయి. యోగి బాబు, మొట్టాయ్ రాజేంద్రన్ , శరణ్య వాళ్ళ పాత్రలకు తగ్గట్టు నటించారు. సినిమా మొత్తం బాగానే ఉన్నప్పటికీ ఎక్కువ తమిళ వాసనే వస్తూ ఉంటుంది. యోగిబాబు కామెడీ చాలా సార్లు నవ్వించింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా నవ్వించి నవ్వును బాగా సాగదీశారనిపిస్తుంది. మొదటి భాగం బాగా ఆకట్టుకున్నా, రెండో భాగం ఎక్కువ ఆకర్షించలేకపోయింది. క్లైమాక్స్ నయనతార నటన అదరగొట్టినా , స్క్రిప్ట్ లో బలం లేకపోవడం, కొంచెం రొటీన్ అనిపించడం కనిపిస్తుంది.

శివకుమార్ విజయం కెమెరా పనితనం చాలా క్రియేటివ్ గా ఉంది. అనిరుద్ రవిచందర్ సంగీతం వినసొంపుగా ఉంది. మొత్తం మీద ఈ సినిమా రొటీన్ సినిమాలకు భిన్నంగా , ఆకట్టుకునేలా ఉంది. కాకపోతే తమిళ నేటివిటీకి తగ్గట్టుగా ఉంది. మరి తెలుగువాళ్లు ఈ సినిమాను ఎంతవరకు ఆమోదిస్తారో చూడాలి.

నటీనటులు: నయనతార, యోగి బాబు తదితరులు.
సంగీతం:అనిరుధ్ రవిచందర్
నిర్మాత: లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
రేటింగ్: 3 /5

- Advertisement -