వర్మ’భైరవ గీత’ ఫస్ట్‌లుక్‌..

221
- Advertisement -

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ప్రేమకథాచిత్రం ‘భైరవగీత’.. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ఈరోజు ఆర్జీవీ స్వయంగా రిలీజ్ చేయగా, ఆ ఫస్ట్ లుక్‌లో ప్రధాన పాత్రలు ఎంతో ఎమోషనల్ లుక్‌లో కనపడుతుండడం విశేషం.. ధనంజయ మరియు ఇర్రా లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ మరియు క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథకి ఇంప్రెస్ అయిన ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ చిత్ర హక్కులను సొంతం చేసుకోగా, ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

RGV’s ‘Bhairava Geetha

తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌ని సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 1 గంటకి రిలీజ్ చేయబోతున్నారు..నటీనటులు: ధనంజయ, ఇర్రా, సాంకేతిక నిపుణులు :దర్శకుడు: సిద్ధార్థ తాతోలు, సమర్పిస్తున్న వారు : రామ్ గోపాల్ వర్మ, నిర్మాతలు: అభిషేక్ నామా, భాస్కర్ రాశి, బ్యానర్: అభిషేక్ పిక్చర్స్.

- Advertisement -