అర్ధనగ్న తార లోనూ అమ్మతనం

46
- Advertisement -

ఈ సమస్త సృష్టిలో దేవ‌త‌ల‌కు కూడా ద‌క్క‌ని అపూర్వ అనుభూతి అమ్మతనం. ఈ లోకమంతా మాతృత్వం మీదే ఆధారపడి నడుస్తోంది. అందుకే, భూమ్మీద అన్నీ ప్రేమ‌ల‌క‌న్నా అమ్మ ప్రేమ మిన్నా అన్నారు. అందుకే, ఆ అమ్మ ప్రేమకు అందరూ అభిమానులే. అందాల తార అయినా, సాధారణ యువతి అయినా అమ్మ అని పిలిపించుకోవడానికి తపించి పోతూ ఉంటుంది. లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌ కూడా ఇందుకు అతీతం కాదు. న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ గ‌తేడాది జూన్ 9న పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఐతే, తమ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో క‌వ‌ల‌ల‌తో ఎమోష‌న‌ల్ పోస్ట్‌లు పెట్టింది నయనతార. స‌రోగ‌సి ద్వారా క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన న‌య‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు వారి ఫోటోల‌ను రివీల్ చేయ‌లేదు. కానీ తమ యానివ‌ర్శరీ సంద‌ర్భంగా న‌య‌న్‌, క‌వ‌ల‌ల ఫోటోల‌ను రివీల్ చేస్తూ షేర్ చేసింది. పిల్లలు ఇద్దరూ నయనతార లా ముద్దుగా ఉన్నారు. ఈ ఫొటోల్లో నయనతారలోని తల్లి ప్రేమను స్పష్టంగా చూడొచ్చు.

Also Read: RRR పై ఆగని ప్రశంసల వర్షం

మొత్తానికి నయనతార తన పిల్లలతో దిగిన ఫోటోలు ఈ రోజు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే.. అమ్మతనానికి ఎవరైనా ఒకేలా ఉంటారని అనిపిస్తుంది. అర్ధ నగ్న అందాలతో, శృంగార భరిత దృశ్యాలలో రెచ్చిపోయే నయనతార ఇలా అమ్మ ప్రేమను చూపిస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. నయనతారలో కూడా గొప్ప అపురూప మైన అమ్మ ఉందని ఈ ఫోటోలు చూస్తే అర్ధం అవుతుంది. ఇన్నాళ్లు నయనతార అనగానే ఫ్యామిలీ లేడీస్ లో సహజంగానే చిన్నచూపు ఉంటుంది. కానీ, నయనతారలోని అమ్మను తక్కువ చేయలేం అని తాజాగా ఈ ఫోటోలు రుజువు చేశాయి.

Also Read: వరుణ్ – లావణ్య మధ్య ప్రేమ ఎలా పుట్టింది ?

- Advertisement -