నయనతార కాస్త యాక్టివ్ ఐతే చాలు అట

28
- Advertisement -

‘జవాన్’ ఫలితంతో హీరో షారుఖ్ ఖాన్ తో పాటు హీరోయిన్ నయనతార కూడా ఫుల్ హ్యాపీనే. కాస్త గ్యాప్ తర్వాత భారీ హిట్ అనిపించుకున్న సినిమా పడింది నయనతారకు. పైగా గత కొన్ని సినిమాలుగా నయనతారకు నెగిటివ్ రిమార్క్ లే పడ్డాయి. దీనికితోడు ఎలాగూ ఆమె ప్రమోషన్స్ కి రాదు. సినిమా గురించి ఇంటర్వ్యూలు ఇవ్వదు. ఇవన్నీ కలిపి నయనతార క్రేజ్ తగ్గడానికి దోహద పడ్డాయి. అలాగే ఒకటి రెండు పబ్లిక్ అప్పీరియన్స్ లు కూడా ఆమెకు మరింత నెగిటివ్ చేసాయి. మరోవైపు అటు పర్సనల్ లైఫ్ లోనూ నయనతార తల్లి అయ్యింది. పైగా ఇద్దరు పిల్లల ఆలనాపాలనా ఆమె చూసుకోవాలి.

తల్లిగా అది తన బాధ్యత అని ఆమె నమ్ముతుంది. ఇలాంటి టైమ్ లో సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంటున్నా అని చెప్పేసింది నయనతార. దీంతో ఫ్యాన్స్ ఇక నయనతార రిటైర్ నే అనేంతగా ఫీలయ్యారు. ఇలాంటి టైమ్ లో జవాన్ సినిమా వచ్చింది. సౌత్ లో కొందరు జస్ట్ ఓకే అన్నా, బాలీవుడ్ లో సూపర్ గా వుంది అన్నారు. మొత్తానికి గ్లామర్ పార్ట్ గా నయనతారకు ఫుల్ మార్కులు పడ్డాయి. పైగా రొమాంటిక్ సీన్లలో కూడా నయనతార బాగుంది అనిపించుకుంది. హిందీలో హీరోయిన్ల కొరత చాలా వుంది. నటన విషయంలో నయనతారకు కొత్తగా సర్టిఫికెట్ లు ఇవ్వక్కరలేదు.

అందుకే, ఇప్పుడు బాలీవుడ్ చూపు నయనతార మీద పడింది. ఆమె కాస్త యంగ్ గ్లామరస్ లుక్స్ తో కనిపించగలిగితే చాలు. భారీ పాన్ ఇండియా సినిమాలు ఆమె చేతిలోకి వస్తాయి. యంగ్ హీరోలను పక్కన పెడితే, బాలీవుడ్ లో కూడా సీనియర్ హీరోలు చాలా మంది వున్నారు. వాళ్లకు ఎప్పుడూ హీరోయిన్ల సమస్యే. అందువల్ల నయనతార కనుక కాస్త యాక్టివ్ అయితే బాలీవుడ్ లో కూడా ఆమె ఓ వెలుగు వెలగొచ్చు.
Also Read:సూపర్ కాంబినేషన్..రోగాలన్నీ చెక్!

- Advertisement -