పేద యువతికి సర్‌ప్రైజ్ ఇచ్చిన సీఎం స్టాలిన్..

156
stalin
- Advertisement -

తమిళనాడు సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా నివారణ నిధికి విరాళమిచ్చిన పేద యువతికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

ఈనెల 12న మేట్టూరుకు వెళ్లిన సీఎం స్టాలిన్‌ను కలిశారు నామక్కల్‌‌కు చెందిన సౌమ్య. తన బంగారు గొలుసు తాకట్టు పెట్టిన సొమ్మను కరోనా నివారణ నిధికి విరాళంగా ఇచ్చిన సౌమ్య… తన గోడును ముఖ్యమంత్రికి లేఖ రూపంలో వెళ్లబోసుకుంది. తనది పేద కుటుంబమని, తాను ఇంజినీరింగ్ పూర్తిచేసినా ఉద్యోగం రాలేదని, తండ్రికి వచ్చే ఫించన్‌తో కుటుంబ గడవడం కష్టంగా ఉందని సౌమ్య తెలిపింది.

దీంతో వెంటనే స్పందించిన స్టాలిన్…ఆమె తాకట్టు పెట్టిన బంగారు గొలుసును విడిపించమే కాకుండా ఉద్యోగం చూపించాలని ఆదేశించారు. దీంతో ఓ ప్రైవేట్ సంస్థలో సౌమ్యకు రూ.17వేల జీతంతో మంచి ఉద్యోగం లభించింది. నియామక పత్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ మంగళవారం ఆమెకు అందజేశారు. దీంతో ఆమె ఆనంధానికి అవదుల్లేకుండా పోయాయి.

- Advertisement -