సి‌ఎం పదవి మరిచావా..రేవంత్ రెడ్డి?

16
- Advertisement -

సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం చూస్తుంటాము. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీల నెరవేర్పులో నిర్లక్ష్యం వహించినప్పుడు, లేదా కొత్త విధివిధానాలు ప్రవేశ పెట్టినప్పుడు ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించడం మామూలే. కానీ తెలంగాణలో ఇందుకు భిన్నం అధికార పార్టీ నేతలే ప్రతిపక్షంపై విమర్శలు గుప్పిస్తుండడంతో ప్రజలు ఇదెక్కడి విడ్డూరం అని నోరెళ్ళబెడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు రెండు నెలలు అవుతున్న.. తాము అధికార పక్షం అని మరిచి విమర్శలు గుప్పించి నవ్వుల పాలు అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటీవల సి‌ఎం రేవంత్ రెడ్డి చేసేన వ్యాఖ్యలు గమనిస్తే.. అసలు ఆయన సి‌ఎం పదవిలో ఉన్నాననే సంగతి మర్చిపోయారా అనే సందేహాలు రాక మానవు. .

ఎలక్షన్ ప్రచారంలో విమర్శలు గుప్పించినట్లుగా ” సన్నాసి, దద్దమ.. ” అనే అభ్యంతరకర పదాలను ఉపయోగిస్తూ కే‌టి‌ఆర్ పై విమర్శలు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి సహచర ఎమ్మెల్యేను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వ్యాఖ్యలు సాధారణమైనప్పటికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తుండడంతో సి‌ఎం హోదాను అగౌర పరిచేలా ఆయన వ్యవహరిస్తున్నారనే టాక్. వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బి‌ఆర్‌ఎస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని, చేతనైతే ఆరు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాలని హితవు పలుకుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఇటీవల రేవంత్ రెడ్డి కే‌టి‌ఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సి‌ఎం హోదాను తగ్గించే విధంగా ఉన్నాయనేది చాలమంది అభిప్రాయం.

Also Read:Tapsee:త్వరలో తాప్సీ పెళ్లి?

- Advertisement -