శ్రీరంగనాథస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్..

338
kcr tamil tour

తమిళనాడు పర్యటనలో భాగంగా శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు సీఎం కేసీఆర్. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి ఆలయాన్ని సంద్శించిన సీఎం ప్రత్యేక పూజలు చేశారు. తన పర్యటనలో భాగంగా తిరుచ్చి ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు.

అనంతరం సాయంత్రం 4.30 గంటలకు డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో భేటీ కానున్నారు. కేంద్రంలో కీలకంగా మారేందుకు ప్రాంతీయపార్టీలను ఏకం చేస్తున్న సీఎం కేసీఆర్..స్టాలిన్‌తో మరోసారి తన ప్రతిపాదనను వివరించనున్నారు.

kcr tamilnadu

మే 23 ఎన్నికల ఫలితాల కేంద్రంలో ఏర్పాటుకాబోయే ప్రభుత్వంలో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించాలని.. ప్రాంతీయపార్టీల వద్దకే జాతీయపార్టీలు వచ్చేలా అందరం కలిసి ముందుకువెళ్దామని డీఎంకే అధినేతకు వివరించనున్నారు కేసీఆర్.

ప్రస్తుతం స్టాలిన్‌..కాంగ్రెస్‌ కూటమిలో ఉండటంతో వీరిద్దరి భేటీ క్యాన్సిల్ అయిందని వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం కేసీఆర్ సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు.