మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డికి కేటీఆర్ నివాళి

204
malkajgiri ktr

మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి భౌతికకాయానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. కనకారెడ్డి కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కనకారెడ్డిని కడసారి చూసేందుకు టీఆర్ఎస్‌ కార్యకర్తలు,స్ధానికులు పెద్దసంఖ్యలో వచ్చారు.

కేటీఆర్‌తో పాటు మంత్రులు మల్లారెడ్డి,ఈటల రాజేందర్,ఇంద్రకరణ్ రెడ్డి,తలసాని,మహమూద్ అలీ,స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రసమయి,బేతి సుభాష్‌ రెడ్డి,ప్రజా గాయకుడు గద్దర్‌తో పాటు వివిధ పార్టీల నేతలు నివాళులు అర్పించారు.

అనారోగ్యం కారణంతో శనివారం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మృతి చెందారు మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి. కిమ్స్‌లో చికిత్స కొనసాగుతుండగానే ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.