తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ ఎల్పీ భేటీ..

443
trslp
- Advertisement -

తెలంగాణ శాసనసభ శీతాకాల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరుగనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం భేటీ కానుంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన తరుణంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో ఆ పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సమావేశాల్లో విపక్షాలు ఏ డిమాండ్లు చేస్తాయి, ఏ ప్రశ్నలు సంధిస్తాయన్న అంశాలపై దృష్టి పెట్టడం..గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు పూర్తీ వివరణ ఇచ్చేలా సిద్ధం కావాలని మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్. అలాగే టీఆర్‌ఎస్‌ శాసన సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అలాగే రెండున్నరేళ్ల స్వల్ప సమయంలో రాష్ట్ర అభివృద్ధి..సంక్షేమం కోసం ఏం చేశామో చెప్పుకోవడానికే ప్రాధాన్యమివ్వాలన్న వ్యూహంతో అధికార పార్టీ ఉందని నేతలు చెబుతున్నారు.

KCR

విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు..ఆయా శాఖల వారీగా పూర్తి వివరాలను సభ ముందుంచే వ్యూహంతో ఉందని అంటున్నారు. ఈసారి ప్రధానంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణ మాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున ఈ అంశాలపై సీఎం సభ్యులకు వివరించే వీలుంది. ఇక నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు తీసుకున్న చొరవ తదితర అంశాలనూ భేటీలో సీఎం తమ సభ్యులకు తెలియజేస్తారని సమాచారం.

మొత్తంగా శీతాకాల సమావేశాలను అర్థవంతంగా ముగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అధికార పక్ష సభ్యులుగా నిర్వహించాల్సిన బాధ్యతపై దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలో రాజకీయం కోణం కాకుండా..ప్రజలకు ఉపయోగ పడేలా అర్ధవంతమైన చర్ఛ జరగాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలకు విజ్ఞాప్తి చేశారు. తాము ఎలాంటి చర్చలకైనా సిద్ధమని..అందుకు ప్రతిపక్షాలకు తగిన సమయం ఇస్తామని తెలియజేసిన విషయం తెలిసిందే.

- Advertisement -