బహరైన్ టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సతీష్..

92
trs

ఎన్నారై బహరైన్ శాఖ టి. ఆర్. యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాధారపు సతీష్ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నారై బహరైన్‌ శాఖ టీఆర్‌ఎస్‌ నూతన కమిటీని ఎన్నుకొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు బహరైన్ లో టి. ఆర్. యస్ పార్టీ బలోపేతానికి రాధారపు సతీష్‌ ఎంతగానో శ్రమించిన సత్తీష్‌ ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. బహరైన్ లో టీఆర్‌ఎస్‌ శాఖను ఏర్పాటు చేసి..తెలంగాణ బిడ్దలందరిని ఏకం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కేసీఆర్ గారి నాయకత్వ అవసరాన్ని చాటి చెప్తూ, స్వరాష్ట్రానికి మైళ్ళ దూరం లో ఉన్నా వీరి సామాజిక బాధ్యత ఎందరికో స్పూర్తిగా నిలిచింది.

bahrain

బహరైన్‌ టీఆర్‌ఎస్‌ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు రాధారపు సతీష్‌ సీఎం కేసీఆర్‌ గారికి కృతజ్ఞతలు తెలిపారు. బ్రతుకు దెరువుకు బహరైన్ వచ్చిన మాకు, నాడు తెలంగాణ ఉద్యమం లో..నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో అవకాశం కల్పించిన కే సీ ఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగంతంగా బహరైన్ వచ్చి మాలో స్పూర్తిని నింపి మామ్మల్ని ప్రోత్సహించిన ఎంపీ కవిత గారికి, అలాగే అన్ని సందర్బాల్లో సహకరించి ముందుకు నడిపిస్తున్న యావత్ టి. ఆర్. యస్ పార్టీ నాయకులకు, కార్యవర్గ సభ్యులందరికి హృదయ పూర్వక సమస్కలు తెలియజేశారు.

తెలంగాణ సమాజం టి. ఆర్. యస్ పార్టీ ని, కే సీ ఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చడం చారిత్రక అవసరమని, మావంతు బాధ్యత గా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్లాగా అందరితో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు. వివిద దేశాల్లో ఉన్నప్పటికీ అనుక్షణం మాకు సహకరిస్తున్న ఎన్నారై టి. ఆర్. యస్ నాయకులు అనిల్ కూర్మాచలం గారికి, మహేష్ తన్నీరు గారికి మరియు జువ్వాడి శ్రీనివాస్ రావు గారికి ధన్యవాదాలు తెలిజయేశారు..

నూతన కమిటీ వివరాలు :

వర్కింగ్ ప్రెసిడెంట్ – సతీష్ కుమార్ రాధారపు
వైస్ ప్రెసిడెంట్ – వెంకటేష్ బోలిశట్టి
జనరల్ సెక్రెటరీ లు – లింబాద్రి పుప్పల మరియు డా. రవి
సెక్రెటరీలు – ప్రశాంత్ పిట్ల, రవి పటేల్ దెషెట్టి మరియు సుమన్ అన్నారం
జాయంట్ సెక్రెటరీ లు – సదనంద్ రేగుల్ల, గంగాధర్ గుమ్ముల, రాజేంధార్ మగ్గిడి
మరియు సంజీవ్ బురమ్
ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ – సుధాకర్ ఆకుల, రాజేష్ ప్రశాంత్, రాజు నేరెళ్ళ , నర్సయ్య శానిగరం