ఏడాదిన్నర తర్వాత…

45
mmts

ఏడాదిన్నర తర్వాత లోకల్ ట్రైన్స్ పట్టాలెక్కనున్నాయి. బుధవారం నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్లు పట్టాలెక్కనుండగా తొలుత పది సర్వీసులు నడవనున్నాయి. మిగితావి దశల వారీగా పట్టాలెక్కనుండగా తొలి ట్రైన్ ఉదయం 7.50 గంటలకు ఫలక్‌నుమా నుంచి బయలుదేరనుంది. ఫలక్‌నుమా – లింగంపల్లికి 6 సర్వీసులు, లింగంపల్లి – హైదరాబాద్‌కు 4 సర్వీసులు నడపనుండగా కొవిడ్‌ నిబంధనలను ప్రయాణీకులు పాటించాల్సి ఉంటుంది.

లాక్‌డౌన్‌తో గతేడాది మార్చి 23న సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు, భౌతికదూరం పాటించాలని సూచించింది. తొలి ట్రైన్‌ ఫలక్‌నుమా నుంచి ఉదయం 7.50 ప్రారంభమవుతుందని, రాత్రి 7.32 గంటల వరకు సర్వీసులు ముగుస్తాయని ఎస్‌సీఆర్‌ అధికారులు వివరించారు. ఈ మేరకు టైం టేబుల్‌ను విడుదల చేశారు.