ఎంపీగా కేసీఆర్..ఎక్కడినుండో తెలుసా..!

290
kcr medak
- Advertisement -

కరీంనగర్ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలపాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా కేసీఆర్ ఎక్కడినుండి పోటీచేస్తారో అన్న సందిగ్దం అందరిలో నెలకొంది.

గతంలో కరీంనగర్,మెదక్,మహబూబ్‌నగర్‌ నుండి ప్రాతినిధ్యం వహించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న కేసీఆర్ ఈ మూడు చోట్ల నుండి భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఇందులో తనకు కలిసొచ్చిన కరీంనగర్ లోక్ సభ సీటును మరోసారి సిట్టింగ్ ఎంపీ వినోద్‌కు కేటాయించారు. అంతేగాదు ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైతే వినోద్‌ కేంద్రమంత్రి అవుతారని చెప్పారు.దీంతో కరీంనగర్‌ నుండి కేసీఆర్ బరిలో నిలిచే ఛాన్స్ లేనట్టే.

ఇక కొంతకాలంగా కేసీఆర్ నల్గొండ లేదా మెదక్ నుండి పోటీచేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నల్గొండ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో మెజార్టీ స్ధానాలు టీఆర్ఎస్ గెలుచుకున్న కాంగ్రెస్‌కు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో హస్తం పార్టీని దెబ్బతీసేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నల్గొండ కాకపోతే మెదక్‌ నుండి పోటీ చేయొచ్చని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్‌,గజ్వేల్ అసెంబ్లీ నుండి పోటీచేసిన కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మొత్తంగా సీఎం కేసీఆర్ లోక్ సభకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

- Advertisement -