CM KCR:బంగారు తునకగా పాలమూరు

43
- Advertisement -

పాలమూరు బంగారు తునకగా మారుస్తామన్నారు సీఎం కేసీఆర్. జడ్చర్ల ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…పాలమూరు ఎత్తిపోథల పథకం సోర్స్‌ని శ్రీశైలంకు మార్చామన్నారు. 1956లో చిన్న పొరపాటు జరిగింది ఆ దెబ్బకు మనల్ని ఆంధ్రాల్లో కలిపితే 60 ఏళ్లు గోసపడ్డామన్నారు. బొంబాయి బతుకులకు పాలమూరు జిల్లా కేరాఫ్‌గా మారిందన్నారు. ఎన్నో బాధలు పడ్డాం..పల్లె పల్లెలో పల్లెర్లు మొలిశాయనే పాటలు వచ్చాయన్నారు. కానీ అందరి పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామన్నారు.

తెలంగాణ వచ్చాక సాగునీటి రంగంలో మార్పులు తీసుకొచ్చామన్నారు. జడ్చర్లను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. ఉమ్మడి పాలమూరు అభివృద్ధి కృషి చేశామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల దద్దమ్మలు అని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోథలను అడ్డుకునేందుకు వందల కేసులు వేశారన్నారు. కానీ ధర్మం గెలుస్తది అని చెప్పినా కేసులన్ని వీగిపోవడంతో ఇటీవలె పాలమూరు ఎత్తిపోథలను ప్రారంభించుకున్నామని చెప్పారు.

Also Read:రేణు దేశాయ్‌ రెండో పెళ్లి అప్పుడే  !

రాబోయే నాలుగు నెలల్లో అన్ని రిజర్వాయర్లు జలకళ సంతరించుకుంటాయన్నారు.జడ్చర్లలో లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పారు. శంషాబాద్‌కు దగ్గరల్లోనే జడ్చర్ల ఉందని రాబోయే రోజుల్లో ఐటీ హబ్‌గా జడ్చర్ల మారనుందన్నారు.మహబూబ్‌నగర్‌ ఎంపీగానే తెలంగాణ సాధించానని గుర్తు చేశారు సీఎం. గతంలో కృష్ణా నది పక్కనే ఉన్నా పాలమూరు ఎడారిగానే ఉండేదని కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు దర్శనమిస్తున్నాయని చెప్పారు. పాలమూరును బంగారు తనుకగా మారుస్తామన్నారు. మతాలు లేవు , కులాలు లేవు అందరిని కడుపులో పెట్టుకుని సమానంగా చూసుకుంటు పోయామన్నారు.

రెసిడెన్షియల్ స్కూల్స్‌తో విద్యా వ్యవస్థ మెరుగుపడిందన్నారు. ఏ పథకం తీసుకున్న ప్రజలందరికి లబ్ది చేకూరిందన్నారు. కొందరు పాలకులు పాలమూరును దత్తత తీసుకున్నారు కానీ చేసిందేమీ లేదన్నారు.కృష్ణా జిల్లాలో మన హక్కుల కోసం ఎంతో పోరాటం చేశామన్నారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అన్నారు. భారతదేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రం తెలంగాణ అన్నారు.మేనిఫెస్టోలో రైతుల కోసం పెద్ద ఎత్తున హామీ ఇచ్చామన్నాను. ప్రపంచంలోనే ఎక్కడా రైతు బంధు లేదన్నారు. రైతుల బాధలు తనకు తెలుసని…అందుకే రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చానని చెప్పారు. రైతు రుణాలు మాఫీ చేశామని తెలిపిన సీఎం..ఇంకొ పదేళ్లు కష్టపడితే తెలంగాణ రైతు భారతదేశంలోనే గొప్ప రైతుగా మారే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ పొరపాటున వస్తే కరెంట్‌ను ఆగం చేస్తారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలోనే రైతులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుని ఓటేయాలని సూచించారు. ఉద్దండాపూర్‌లో భూములు ఇచ్చిన వారికి నష్ట పరిహారంతో అన్ని ప్రయోజనాలు చేకూరుస్తామన్నారు.

Also Read:కాంగ్రెస్‌లో తగ్గని కన్ఫ్యూజన్ గోల?

- Advertisement -