రాహుల్‌ పర్యటనను నిరసిస్తూ ములుగులో పోస్టర్లు

32
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనను నిరసిస్తూ ములుగు నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. ములుగు జిల్లా గురించి ఏనాడు మాట్లాడని రాహుల్ గాంధీ ఇప్పుడు ఓట్ల కోసం వచ్చాడంటూ వెలసిన పోస్టర్లలో ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ గురించి పార్లమెంట్లో ఏనాడు మాట్లాడలేదని, రామప్ప అభివృద్ధి నిధుల గురించి ఏనాడు కూడా కేంద్రాన్ని అడగలేదని, పార్లమెంట్లో ప్రస్తావించలేదని, వనదేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా గురించి ఏనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడని వ్యక్తి ఇప్పుడు ఎన్నికలు రాగానే ప్రజల వద్దకు వస్తున్నారని పోస్టర్ల ద్వారా ప్రశ్నించారు.

ఓట్ల కోసం పరుగెత్తుకుంటూ వచ్చాడని రాహుల్ గాంధీ ఫోటోతో పోస్టర్లు వెలియగా కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి ప్రజలే పోస్టర్లు వేసినట్టుగా సమాచారం. పోస్టర్లు చూసి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తీరుపై చర్చించుకుంటున్నారు ప్రజలు. ఓట్ల వేటగాళ్లు అవసరమా మనకు అందులో ఉండగా సీతక్క గాని, రాహుల్ గాంధీ గానీ ఏనాడ ములుగును పట్టించుకోలేదంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

Also Read:CM KCR:బంగారు తునకగా పాలమూరు

- Advertisement -