కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు..

75
- Advertisement -

మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్యారోగ్యశాఖను ఆదేశించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొదటగా కరోనా పరిస్థితిపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు కరోనా పరిస్థితిని గణాంకాలతో వివరించారు. రాష్ట్రంలో కరోనా అదుపులో ఉన్నదని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చామని, అర్హులైన అందరికీ అతి త్వరగా వ్యాక్సిన్స్ ఇస్తామని మంత్రి తెలిపారు.ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని మంత్రి తెలిపారు.

కాగా, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్యారోగ్యశాఖ మంత్రిని, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని జిల్లాల మంత్రులు కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సిఎం ఆదేశించారు.

- Advertisement -