కవి దేవీప్రియ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

55
cm kcr

ప్రముఖ కవి దేవీప్రియ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. కవిగా, రచయితగా, కార్టునిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారని సీఎం కొనియాడారు. ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయ‌న సాహిత్య ప్ర‌తిభ‌కు ‘గాలి రంగు’ ర‌చ‌న మ‌చ్చుతున‌క అని అన్నారు.

సాహితీ లోకంలో దేవీప్రియగా గుర్తింపు పొందిన ఆయ‌న‌ అస‌లుపేరు షేక్‌ ఖాజా హుస్సేన్. కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్న దేవీప్రియ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఇవాళ ఉదయం 7.10 గంటలకు తుదిశ్వాస విడిచారు.