జో బైడెన్ @ 78

229
biden
- Advertisement -

అమెరికా 46వ దేశాధ్య‌క్షుడిగా ఎన్నిక అయిన జో బైడెన్‌ పుట్టినరోజు నేడు. తన 78వ పుట్టినరోజు జరుపుకుంటున్న బైడెన్‌.. అమెరికా చ‌రిత్ర‌లో దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోనున్న అత్యంత పెద్ద వ‌య‌సు ఉన్న నేత‌గా ఆయ‌న రికార్డుకెక్కారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో దేశాధ్య‌క్షుడిగా బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే హోరాహోరిగా సాగిన పోరులో బైడెన్ ట్రంప్‌పై ఘనవిజయం సాధించారు. రిపబ్లికన్ల కంచుకోటలను బద్దలు కొడుతూ బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ట్రంప్ మాత్రం తన ఓటమిని ఇప్పటికి అంగీకరించలేదు. బైడెన్ 306 ఓట్లు సాధించగా ట్రంప్ 232 ఓట్లు సాధించారు.

1942లో అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్‌ ప్రాంతంలో బైడెన్‌ జన్మించారు బైడెన్. 1966లో బైడెన్‌ నీలియా హంటర్‌ను వివాహమాడారు. వారికి ముగ్గురు బైడెన్‌ 1972లో 29ఏండ్ల వయస్సులో డెలావర్‌ నుంచి మొట్టమొదటిసారి సెనేట్‌కు ఎన్నికయ్యారు. అతి తక్కువ వయస్సులో సెనేట్‌కు ఎన్నికైన ఐదో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మొత్తం 6 సార్లు సెనేట్‌కు ఎన్నికయ్యారు. ఓ రోడ్డు యాక్సిడెంట్‌లో భార్య నీలియా, కూతురు నవోమీ చనిపోయారు. ఇద్దరు కుమారులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో తనకు ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని బైడెన్‌ ఓ సందర్భంలో చెప్పారు.

తన భార్య నీలియా మరణానంతరం 1977లో ఆయన జిల్‌ జాకబ్స్‌ను రెండో పెండ్లి చేసుకున్నారు. వారికి ఒక కూతురు. 1988లో బైడెన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఆయన ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. 2015లో బైడెన్‌ కుమారుడు బ్యూ బ్రెయిన్‌ క్యాన్సర్‌తో చనిపోయారు. అప్పుడే భార్య మాదకద్రవ్యాలకు బానిసయ్యారు. ఆ సమయంలో బైడెన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

- Advertisement -