తెలంగాణ బహుజన వర్గాల స్పూర్తి ఐలమ్మ- సీఎం కేసీఆర్‌

258
- Advertisement -

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళాచైతన్యానికి ప్రతీకగా నిలిచిన, చిట్యాల (చాకలి) ఐలమ్మ 126 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు, ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తని స్మరించుకున్నారు. అత్యంత వెనకబడిన కులం (ఎంబీసీ)లో జన్మించిన ఐలమ్మ తెలంగాణ బహుజన వర్గాల స్పూర్తి ప్రదాతగా సీఎం పేర్కొన్నారు.

సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన కోసం, చట్టం పరిధిలో, కోర్టుల్లో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది చిట్యాల ఐలమ్మ అని సీఎం కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి ఇమిడి వున్నదన్నారు. చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, భావితరాలు గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని సీఎం తెలిపారు.

- Advertisement -