నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’పై మ‌హేశ్ ప్ర‌శంస‌లు..

51
mahesh

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. దీంతో సినీ ప్రముఖులు సినిమాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా మూవీపై సూపర్‌ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు శేఖర్‌ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారని ఆయ‌న అన్నాడు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడని, ఆయ‌న న‌టించిన తీరు చాలా బాగుందని మ‌హేశ్ బాబు చెప్పాడు. ‘ల‌వ్ స్టోరీ’ సినిమా నాగ చైత‌న్య‌కు గేమ్‌ చేంజర్‌ అవుతుందని ఆయ‌న ప్ర‌శంసించాడు. హీరోయిన్ సాయిపల్లవి ఎప్పటిలాగే ఈ సినిమాతోనూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని మ‌హేశ్ బాబు అన్నాడు.

సాయి ప‌ల్ల‌వికి అసలు ఎముకలు ఉన్నాయా? అన్న సందేహం కలుగుతుందని ఆమె డ్యాన్స్‌ను మ‌హేశ్ కొనియాడాడు. ఆమెలా డ్యాన్స్‌ చేసేవాళ్లని ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. ఈ సినిమాకు సంగీతం అందించిన ప‌వన్ సీహెచ్ సంచలనమే అని చెప్పాలని మ‌హేశ్ బాబు అన్నాడు. ఆయ‌న‌ రెహమాన్ సర్ శిష్యుడని త‌న‌కు తెలిసింద‌ని అన్నాడు. ఇది రెహ‌మాన్ స‌ర్ గ‌ర్వ‌ప‌డే స‌మ‌యమ‌ని ఆయ‌న చెప్పాడు.