చేకూరి కాశయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

40
kcr

మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్, చేకూరి కాశయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా, తెలంగాణ అభ్యుదయవాదిగా, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నిస్వార్థ రాజకీయనేత అని చేకూరిని సీఎం గుర్తుచేసుకున్నారు. చేకూరి కాశయ్య మరణంతో నిజాయితీ కలిగిన ఒక సీనియర్ రాజనీతిజ్జున్ని రాష్ట్రం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దివంగత చేకూరి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.