సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవార్థం రాజ్ భవన్లో గవర్నర్ తమిలిసై సౌందర్ రాజన్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ కూడా రాజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.3 రోజులపాటు రాజ్ భవన్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బస చేయనుండగా ఆయనతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి తెలంగాణకు వచ్చిన ఎన్వీ రమణకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలికిన వారిలో మంత్రి కేటీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ, సీఎస్ సోమేశ్ కుమార్, డిజీపీ మహేందర్ రెడ్డి
పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, అరికెపూడి గాంధీ, జీవన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ముఠా గోపాల్, నల్లమోతు భాస్కర్ రావు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.