తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా ) రూపొందించిన రెవెన్యూ డైరీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్‌తో పాటు అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, నిరంజన్ రావు, వాణి, సంతోష్ లాల్, మాధవి, సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గం నారాయణరెడ్డి, నాగమణి, వివిధ జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి, శుక్ల కుమార్, బొమ్మ రాములు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. రెవెన్యూ డైరీలో రెవెన్యూ చట్టాలు, ముఖ్యమైన జీఓల గురించి సమగ్ర సమాచారం పొందుపర్చారని అభినందించారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ త్వరలో ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలుతో పాటు రెవెన్యూ శాఖలో అన్ని కేడర్ల పదోన్నతులు కల్పించి ఖాళీల భర్తీకి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖలో క్రింద స్థాయి సిబ్బందిని పెంచమని, అలాగే వీఆర్వోలను రెవెన్యూశాఖలో సర్దుబాటు చేయమని ట్రెసా సీఎం దృష్టికి తీసుకెళ్లింది.