టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు..

44
trs

ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్యాలయ ఆటో అడ్డ నుండి పలు పార్టీల నుండి 70 మంది ఆటో (డ్రైవర్స్)కార్మికులు టీఆర్‌ఎస్‌కేవీలో చేరారు. గురువారం టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌కేవీ నాయకులు పాల్వంచ కృష్ణ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి పువ్వాడ ఖమ్మం కార్పొరేషన్ 13వ డివిజన్లలో రూ.75 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు మేయర్ పాపాలాల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.