CM KCR:వరంగల్‌ నుండే ఎన్నికల శంఖారావం

33
- Advertisement -

వరంగల్ జిల్లా నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతున్నారు గులాబీ బాస్ సీఎం కేసీఆర్. అక్టోబర్ లో 10 లక్షల మందితో భారీ బహిరంగసభను నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. 150 ఎకరాల్లో బహిరంగసభ, 200 ఎకరాల్లో పార్కింగ్‌ ఉండేలా వరంగల్‌ నగర శివారులోని దేవన్నపేట ప్రాంతాన్ని ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది.

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ అక్టోబర్‌ లో వస్తుందని అంచనా వేస్తున్న తరుణంలో ఈ ప్రక్రియకు ముందే భారీ బహిరంగసభను నిర్వహించనున్నరని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్.

వరంగల్…సీఎం కేసీఆర్‌కు మంచి సెంటిమెంట్. పార్టీ ప్రారంభించిన దగ్గరి నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ బాస్‌కు అండగా నిలస్తూ వస్తోంది. అందుకే కీలకమైన నిర్ణయాలు తీసుకున్న వరంగల్ వేదికగానే జరిగాయి. కల్యాణలక్ష్మి, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకాల అమలు, గుడుంబా నివారణ వంటి ఎన్నో కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచే ప్రకటించారు.

Also Read:కాంగ్రెస్ ఒడితే.. రేవంత్ రెడ్డి జంప్?

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత 2001 జూన్‌ 21న కాకతీయ డిగ్రీకాలేజీలో మొదటిసారి బహిరంగసభ జరిగింది. భారీ సంఖ్యలో జనం ఈ సభకు వచ్చారు. 2017లో టీఆర్‌ఎస్‌ వార్షికోత్సవం సందర్భంగా పది లక్షల మందితో నిర్వహించిన ప్రగతి నివేదన సభ దేశవ్యాప్తంగా చర్చనీయాశమైంది. తాజాగా ఈ సారి కూడా అదే సెంటిమెంట్‌తో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న సీఎం కేసీఆర్…వరంగల్ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:25న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం

- Advertisement -