కాంగ్రెస్ ఒడితే.. రేవంత్ రెడ్డి జంప్?

31
- Advertisement -

ప్రస్తుతం టి కాంగ్రెస్ ఏ స్థాయిలో హడావిడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు అంతర్గత కుమ్ములాటలతో తెగ ఇబ్బంది పడిన హస్తం పార్టీ ఇప్పుడు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కాగా పార్టీలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి వర్సస్ సీనియర్స్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గానే నిలుస్తూ వస్తోంది. పార్టీలోని చాలమంది సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డిపై ప్రదర్శించిన వ్యతిరేకతను బట్టి చూస్తే సీనియర్స్ ఆయనను వలసదారుడిగా చూస్తున్నారే తప్ప కాంగ్రెస్ నేతగా చూడడం లేదనేది క్లియర్ గా స్పష్టమౌతోంది. .

ఈ నేపథ్యంలో ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒడితే రేవంత్ రెడ్డి మళ్ళీ పార్టీ మారతారా ? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం వెలువడుతున్న సర్వేలు మళ్ళీ బి‌ఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేల్చి చెబుతున్నాయి. ప్రజానీకం కూడా కే‌సి‌ఆర్ పాలనపై సానుకూలంగానే ఉంది. దీంతో హస్తం పార్టీకి ఓటమి తప్పదనేది ఆ పార్టీ నేతలకు కూడా తెలిసిన విషయం. అయితే కాంగ్రెస్ ఒడితే రేవంత్ రెడ్డి ఆ పార్టీ కి గుడ్ బై చెబుతారని, ఇప్పటివరకు రేవంత్ రెడ్డి భుజాలపై చాలా కండువలు మారాయని ఏంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవ్వడంతో పాటు హస్తం పార్టీని కూడా కలవర పెడుతున్నాయి. మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వలసదారుడిగానే పరిగణిస్తున్న నేతలు.. ఆయన పార్టీ వీడిన ఆశ్చర్యం లేదనే భావనలో ఉన్నట్లు టాక్. రేవంత్ రెడ్డి ఆ స్థిరత్వం కలిగిన వ్యక్తి అని హస్తంపార్టీలోనే చాలమంది భావిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డిపై సీనియర్స్ లో తీవ్రమైన అసమ్మతి ఉంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ధీమాగా ఉన్నప్పటికి.. ఒడితే రేవంత్ రెడ్డి ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read:బీఆర్ఎస్‌లోకి తెల్లం వెంకట్రావ్!

- Advertisement -