29న కొండపోచమ్మ సాగర్ ప్రారంభం..

386
minister harishrao
- Advertisement -

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్‌ని ప్రారంభించనున్నారని చెప్పారు మంత్రి హరీష్ రావు. ఉదయం 11:30 కి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభం కానుందన్నారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతర్ పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసి, నియంత్రిత పంటల సాగు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్థికశాఖ మంత్రి హారిష్ రావు,జెడ్పిచైర్పర్సన్ రోజాశర్మ, జిల్లా రైతుసమన్వ కో ఆర్డినేటర్ నాగిరెడ్డి.ఎఫ్డిసి ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.

వ్యవసాయ దండగ కాదు వ్యవసాయం పండగ అని అనిపించాలనేది కేసీఆర్ కళ అన్నారు హరీష్ రావు. ఇది నియంత్రిత పంటల సాగు కాదు,ప్రాధాన్యత పంటల సాగు అని అధికారులు రైతులకు వివరించాలన్నారు.

దాతర్ పల్లి అంటేనే ఆదర్శ గ్రామం. ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తయారయిందని చెప్పారు. ఈ గ్రామానికి చెందిన సత్యనారాయణ రైతు నాకు బస్తా బియ్యాన్ని పంపిండని చెప్పారు.

ఒకనాడు రెండు ఎకరాల పంట పెడితే అద్దెకరం పొలం అయిన ఎండిపోయేది… ఎరువుల కోసం చెప్పులు పెట్టి ఉండేటోల్లం, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. పంట పండించడం కోసం షావుకారు దగ్గరికి పోయి అప్పు తెచ్చుకునేటోళ్లం అన్నారు.

రైతులు పండించిన ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఇస్తున్నాం… ఈ 10 రోజుల్లో 24 వేల రూపాయల రుణమాఫీ చేస్తాం,లక్షలోపు ఉన్న రుణమాఫీని నెలలోగా మాఫీ చేస్తాం అన్నారు. వాన కాలం మక్కలు పండిస్తే పంట నష్టం వస్తుంది కావున కంది పంటను సాగు చేసుకోవాలన్నారు.

- Advertisement -