డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

110
kcr nagar

సిద్దిపేట జిల్లా నర్సాపూర్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు సీఎం కేసీఆర్. సర్వమత ప్రార్థనల అనంతరం లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేయించారు. ఈ కాలనీకి కేసీఆర్ నగర్‌గా నామకరణం చేయగా గేటెడ్‌ కమ్యూనిటీని తలదన్నేలా ఈ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల సముదాయాన్ని ప్రభుత్వం నిర్మించింది.

సుమారు రూ.163 కోట్ల వ్యయంతో 2460 ఇళ్లను నిర్మించగా తొలివిడతగా 1341 ఇళ్లను సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ సమక్షంలో 144 మంది గృహ ప్రవేశాలు చేశారు. మిగిలినవారు విడుతల వారీగా కొత్త ఇళ్లలోకి వెళ్లనున్నారు. మిగిలిన 1119 ఇళ్లను దశలవారీగా అర్హులకు కేటాయించనున్నారు.