తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట: శ్రీనివాస్ గౌడ్

140
srinivas goud
- Advertisement -

వ్యవసాయానికి పెద్ద పీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అమరేందర్ రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్….కార్పొరేట్ల వల్ల రైతులు కుదేలయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రధాని మోదీ రైతుకు అన్యాయం చేసే చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.

పదవులు మనకు వన్నె తేవని మన పని తీరుతో పదవికే వన్నె తీసుకు రావాలన్నారు. రైతులకు నూతన పాలకవర్గం సరైన న్యాయం చేయాలని కోరారు. రైతు సంక్షేమం కోసం కృషి చేయాలని..నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు లేకుండా చూసేందుకు పాలకవర్గం కృషి చేయాలని మంత్రి కోరారు.

- Advertisement -