- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితులు పెరుగుతుండంతో పలు దేశాల్లో స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లకు సెలవులు ప్రకటించారు. తెలంగాణలో కూడా కరోనా బాధితులు పెరుగుతుండటంతో సర్కార్ హైఅలర్ట్ ప్రకటించింది. అసెంబ్లీలోని కమిటి హాల్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. టెన్త్, ఇంటర్ పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేయనున్నారు.
- Advertisement -