ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు..

175
cm kcr
- Advertisement -

ఆదివారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్., సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, పంచాయితీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఆర్టీసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. క‌రోనా నేప‌థ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల వేత‌నాల్లో విధించిన కోత మొత్తాన్ని తిరిగి చెల్లించాల‌ని సీఎం కేసీఆర్ ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. కోవిడ్ సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని తిరిగి వారికి చెల్లించాలని సీఎం తెలిపారు. అందుకోసం దాదాపు రూ. 120 నుంచి రూ. 130 కోట్లను విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. పార్సిల్ సర్వీసుల బిజినెస్ 1 మిలియన్ దాటిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులను కేసీఆర్ అభినందించారు. అలాగే హైదరాబాద్‌లో సోమవారం నుంచి 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్‌ను మఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ఉద్యోగుల భద్రతపై త్వరలో విధానపర నిర్ణయం తీసుకోబోతున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.

- Advertisement -