సీఎంగా నితీష్ ‌కుమార్‌ ప్రమాణ స్వీకారం..

229
Nitish Kumar
- Advertisement -

ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీయూ అధినేత నితీష్ ‌కుమార్ నేడు బీహార్ తదుప‌రి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ మ‌ధ్యాహ్నం మ‌ధ్యాహ్నం గ‌వ‌ర్న‌ర్ ఫ‌గు చౌహాన్‌ను క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత నితీష్ త‌న ప్ర‌మాణస్వీకారం విష‌యాన్ని ప్ర‌క‌టించారు. త‌న‌తోపాటు కొంద‌రు ఎమ్మెల్యేలు రాష్ట్ర‌ మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు నితీష్ తెలిపారు. ఇవాళ సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఏడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాగా,ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన పోరాటం జరిగింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) 243 సీట్లలో పోటీ చేసి 125 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సాధించింది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసిన మహా కూటమికి 110 సీట్లు వచ్చాయి. ఎన్డీఏలో బీజేపీకి 74 సీట్లు, జేడీయూ 43 సీట్లు వచ్చాయి.బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో జేడీయూ గెలిచినప్పటికీ.. ముందే కుదిరిన అంగీకారం మేరకు నితీష్‌ కుమారే సీఎంగా ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ఏడోసారి జేడీయూ నేత నితీష్‌ కుమార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

- Advertisement -