కేసీఆర్ అంటే ఎందుకంత భయం ???పచ్చ తెరలు తొలగించి చూడండి..!!

268
Kcr
- Advertisement -

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కేరళ సీఎం పినరియ విజయన్ కు జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. మరో రెండు రోజుల్లోనే తమిళనాడులోని డీఎంకే అధినేత స్టాలిన్ న్ కూడా కలవనున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా కేసీఆర్ ఫ్రంట్ లో కలవనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జగన్ ను కలిసి ఫెడరల్ ఫ్రంట్ లో కలవాలని చెప్పిన సంగతి తెలిసిందే.

మిగతా రాష్ట్రాల్లోని ప్రాంతియ పార్టీలు కూడా కేసీఆర్ పెట్టబోయే ఫెడరల్ ఫ్రంట్ లో చేరనున్నట్లు తెలుస్తుంది . అయితే కేసీఆర్ చేస్తున్న పర్యటనల వల్ల చాలా మంది నాయకులు ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతుండటంతో కొంత మంది నాయకులకు మనసుకు పట్టకపోవడంతో ఏం చేయాలో తెలిక కేసీఆర్ పై పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉండే కొన్ని పచ్చ మీడియా సంస్ధలు మాత్రం చంద్రబాబుకు సపోర్ట్ చేస్తూ వార్తలు రాస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతాడు..మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకుడు అన్ని పిచ్చి పిచ్చి వార్తలు రాసి చంద్రబాబుకు భజన చేస్తున్నాయి. ఈవీఎంలకు వ్యతిరేకంగా చంద్రబాబు ధర్నాలు, ఆందోళనలు అట్టర్ ఫ్లాపయ్యాయి.

రేపటి ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏలు పూర్తి మెజార్టీ సాధించలేవనేది ఇప్పటి పరిస్థితిని బట్టి అంచనా. ఎన్డీయేకే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటి కీ మెజార్టీకి కనీసం అరువై, డ్బ్భై స్థానాలు తక్కువే వచ్చే అవకాశం ఉన్న ది. ఎన్డీయేకు, యూపీఏకు కలిపి 260 స్థానాల లోపలే వస్తాయని కేసీఆ ర్ అంచనా. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ చేపట్టబోయే ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో క్రియా శీలక పాత్ర పోషించనుంది. కేసీఆర్ జాతీయస్థాయిలో బలమైన నాయకుడిగా ఉద్భవిస్తాడు. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే దక్షినాది నాయకుడిని పీఎం చేయాలనే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్.

- Advertisement -