వరల్డ్ ఆఫ్ డ్యాన్స్‌..పవన్ క్రేజ్‌కు దేవీ థ్రిల్..!

181
pawan kalyan

దటీజ్ పవర్ స్టార్. టాలీవుడ్‌లోనే కాదు అంతర్జాతీయ వేదికలపై పవన్ సత్తా ఏంటో మరోసారి నిరూపితమైంది. ఎన్‌బీసీ నిర్వహించే వరల్డ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ అనే అంతర్జాతీయ రియాల్టీ షోలో భారత డ్యాన్స్‌ గ్రూప్‌ ది కింగ్స్‌ అదరగొట్టారు. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ పాటకు ది కింగ్స్‌ చేసిన డ్యాన్స్‌కు న్యాయనిర్ణేతలు జెన్నీఫర్‌ లోపేజ్‌, నీ-యో, డెరెక్‌ హూగ్‌ ఫిదా అయ్యారు.

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలోని వాడెవడన్నా.. వీడెవడన్నా పాటకు అద్భుతమైన కొరియోగ్రఫి, డ్యాన్సర్ల టైమింగ్‌ అందరిని ఆకట్టుకుంది. చివర్లో బాహుబలి మ్యూజిక్‌ని వినిపించడంతో స్టేజ్ చప్పట్లతో మార్మోగి పోయింది.

తాను సంగీతం అందించిన పాట అంతర్జాతీయ షోలో ప్రదర్శించబడటంపై హర్షం వ్యక్తం చేశారు దేవీ శ్రీ ప్రసాద్. ది కింగ్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి థ్రిల్ అయ్యాను. గతంలో ఖైదీ నంబర్ 150లోని సుందరీ పాట.. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలోని వాడెవడన్నా పాటకు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. ఎంతో చక్కగా డ్యాన్స్‌ చేశారు. కీప్‌ రాకింగ్‌ స్‌ అని ట్వీట్‌ చేశారు.