దేశం బతికేదే వ్యవసాయంమీద: కేసీఆర్‌

66
CM KCR Excellent Speech

దేశంలో రైతు ఆత్మహత్యలు జరగడం దారుణమన్నారు. ఎంతసేపు అమెరికా..ఇట్లుంటుదంటా..జర్మనీ అట్లుంటుందంటా అని చెప్పుకోవడం తప్పా..మన దేశాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమవుతున్నారన్నారు సీఎం కేసీఆర్‌. ఆదివారం (మార్చి-4) ప్రగతి భవన్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో వచ్చే సంవత్సరంలో కోటీ ఎకరాలకు నీళ్లు ఇస్తామని..దేశం గురించి ఆలోచిస్తే ఎవ్వరికీ ఏమీ జరగలేదన్నారు. 70 సంవత్సరాలు ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రయాణం సాగించాక దేశం ఏమైపోతుందా అనే విషయంపై తనకే ఆశ్చర్యం వేస్తుందన్నారు సీఎం కేసీఆర్.

జాతీయ పార్టీలు ప్రజలతో ఆటలు ఆడుతున్నాయన్నారు. బీజేపీ పోతే కాంగ్రెస్..కాంగ్రెస్ పోతే బీజేపీ తప్పా..అభివృద్ధి చేసేదేమీలేదన్న కేసీఆర్..ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. విద్యా , ఆరోగ్య, వ్యవసాయం విధానాలను రాష్ట్రాలకి అప్పగించాలని, ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటే రాష్ట్రాల పరిస్థితులు అర్థం కావని తెలిపారు.

2014లో కాంగ్రెస్ ని కాదని బీజేపీకి ఓటేస్తే ఏం ఫలితముందని..రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపిస్తే కొత్తగా ఏమైనా మార్పు వస్తుందా అన్నారు. రాజ్యాంగంలో ఫెడరల్ పదం ఉందని..నిజంగా దేశంలో పెడరలిజం ఉందా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. దేశంలో ఉన్న కరెంటు భారతీయులు వాడలంలేదని, రైతులకు కేంద్రం చేసిందేమిలేదన్నారు. దేశం బతికేదే వ్యవసాయంమీదనే అని, రైతులు సంక్షోభంలో కూరుకుపోతుంటే బీజేపీ, కాంగ్రెస్ కళ్లుమూసుకున్నాయన్నారు. అక్రమాలు.. తప్పులు చేసే వారికి భయపడాలని, తమని ముట్టుకుంటే భస్మమైపోతారన్నారు. నిత్యం ధరలు పెరుగుతూనే ఉంటాయి కానీ..రైతు పండించే ధాన్యానికి మాత్రం ధరలు పెరగవన్నారు. తెలంగాణ కోసం తాను పోరాటం చేసినప్పుడు చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని, జైలుకు పంపిస్తానంటే భయపడేవానిని 14 ఏళ్లు పోరాటం చేసి, తెలంగాణ ఎలా సాధిస్తానన్నారు. రైతుల ఆత్మహత్యలు అనే మాట దేశంలో బంద్ కావాలన్నారు. గోదుమల ధర పెంచాలంటే పెంచరని, ఇందుకోసం ప్రభలమైన మార్పు రావాలన్నారు.

ఖచ్చితంగా మీ ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రారంభమవుతదన్నారు. దేశానికి అవసరమైన ఖచ్చితమైనా ఎజెండా ఏర్పరచుకుని ముందుకళ్తామన్నారు. దేశంలో మార్పు తెలంగాణ నుంచే మొదలైందని..తప్పకుండా గెలుస్తామని తెలిపారు సీఎం. రైతాంగానికి రూ. 8 వేల పథకం దేశాన్ని ఆకట్టుకుందని తెలిపిన కేసీఆర్..రైతుల గురించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా దేశంలోని ఏ రాష్ట్రం ఆలోచించడంలేదని చెప్పారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ కూటమి ఏర్పడి..ఒక శక్తిగా మారినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు సీఎం.