కేసీఆర్ కు పూర్తి మద్దతు : పవన్‌

98
Janasena Chief Pawan Kalyan Support to CM KCR Third

ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరపున తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ . ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడిన పవన్‌.. తెలుగు ప్రజలపై కేసీఆర్ కున్న, ప్రేమాభిమానాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని అన్నారు. తెలుగువారు ఎక్కడున్నా ఒకటే అనేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని కొనియాడారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనకు మనస్ఫూర్తిగా తన మద్దతు తెలియజేస్తున్నానని తెలిపారు.

అలాగే జాతీయ పార్టీల తీరు వల్లే ప్రాంతీయ పార్టీలు పుడుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చి ఉంటే జనసేన పార్టీ పుట్టేదే కాదని అన్నారు. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను అర్థం చేసుకోకపోతే థర్డ్ ఫ్రంట్ పుడుతుందని, థర్ఢ్ ఫ్రంట్ కచ్చితంగా ఉండాలన్నది ‘జనసేన’ అభిప్రాయమని అన్నారు. థర్ఢ్ ఫ్రంట్ కు అంకురార్పణ చేయాలనుకున్న కేసీఆర్ ప్రకటనను సాటి తెలుగువాడిగా స్వాగతిస్తున్నానని, మనస్ఫూర్తిగా తాను మద్దతు పలుకుతున్నానని స్పష్టం చేశారు.