సీజేఐ రమణకు సీఎం కేసీఆర్ బర్త్ డే విషెస్

137
nv ramana
- Advertisement -

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపిన సీఎం…ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే అమూల్యమైన తీర్పులనిచ్చి మీదైన ఒరవడిని పరిచయం చేశారని కొనియాడారు. మీ హుందాతనం, వృత్తి పట్ల మీకున్న అంకిత భావం రేపటి తరానికి ఆదర్శం కావాలని, మీరు మరింత కాలం దేశానికి సేవలందించాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని సీఎం ఆకాంక్షించారు.

- Advertisement -