గాడ్‌ఫాదర్‌తో రంగమ్మత్త..!

88
chiru

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ఫుల్ స్వింగ్‌లో ఉంది..మూడు పదుల వయసు దాటినా…ఇద్దరు పిల్లల తల్లైనా అనసూయ ఇప్పటికీ వన్నెతరగని అందం, గ్లామర్‌తో కుర్రకారు మతులు పోగొడుతుంది… ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సిన్మా ఆఫర్లతో అమ్మడు మాంచి బిజీగా ఉంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి అనసూయకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. మొదట మెగా మేనల్లుడు సాయిధర్మతేజ్ సూయసూయ అనసూయ అంటూ ఈ బ్యూటీతో ఓ స్పెషల్ సాంగ్‌లో చిందేశాడు. ఆ తర్వాత రామ్‌చరణ్‌‌ రంగస్థలం సిన్మాలో రంగమ్మత్త పాత్రలో జీవించి ప్రేక్షకులను మెప్పించింది.

ప్రెజెంట్ సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సిన్మాలో అనసూయ ఓ డిఫరెంట్ నెగిటివ్ క్యారెక్టర్‌లో రఫ్ఫాడించబోతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సిన్మాలో అనసూయ మంచి ఆఫర్ కొట్టేసిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మోహన్ రాజా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న గాడ్‌ఫాదర్‌ చిత్రంలో అనసూయకు చిరుతో కలిసి నటించే ఛాన్స్ వచ్చిందని టాక్. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్‌గా హైఓల్టేజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ గాడ్‌ఫాదర్ చిత్రంలో అనసూయ ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆచార్య తర్వాత వస్తున్న ఈ గాడ్‌ఫాదర్ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కావడం ఖాయమని మెగాఫ్యాన్స్ అంటున్నారు. రామ్‌చరణ్ రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌‌కు టర్నింగ్‌పాయింట్‌గా మారింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సిన్మాలో ఆఫర్‌తో అనసూయ క్రేజ్ ఓ రేంజ్‌లో పెరగడం ఖాయమని సినీ జనాలు అంటున్నారు. మొత్తంగా మెగా హీరోల సిన్మాలలో వరుస ఆఫర్లు కొట్టేస్తున్న ఈ జబర్దస్త్ బ్యూటీ టాలీవుడ్‌లో జెట్ స్పీడ్‌గా దూసుకుపోతుందనే చెప్పాలి.