బాలయ్య…అఖండ రిలీజ్ డేట్ ఫిక్స్!

126
nbk
- Advertisement -

నటసింహా నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను అఖండగా పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కు సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 13న సినిమా విడుదల కానుంది. మరోవైపు చిరంజీవి ఆచార్యతో అక్టోబర్ 13న రాబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ చిరు, కొరటాల తమ సినిమా రిలీజ్ కోసం మరింత సమయం తీసుకోనున్నారట. ఇప్పుడు క్రిస్మస్‌ను మంచి సీజన్‌గా భావిస్తున్నారు. అందులో బాలయ్య, బోయపాటి దసరా కానుకగా అఖండను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనిపై త్వరలోనే అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -