గవర్నర్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన సీఎం కేసీఆర్..

407
cm kcr
- Advertisement -

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్ వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి ఆమెకు అభినందనలు తెలిపారు. పూర్తి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు గవర్నర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒకటే రోజు కావడం ఆనందంగా ఉందని గరవ్నర్ అన్నారు. జూన్ 2న పుట్టిన తాను, అదే తేదీన పుట్టిన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా రావడం విధిరాత అని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భారత స్వాతంత్యం తర్వాత అంత సుదీర్ఘ కాలం జరిగిన ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలుస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వారి త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులు అర్పించిన తర్వాతే పతాకావిష్కరణ చేస్తామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, కె.ఆర్. సురేశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఎసిబి డిజి పూర్ణచందర్ రావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫజీయుద్దీన్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, నాగేందర్, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరలు కూడా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -