తెలంగాణ అసెంబ్లీ దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్

159
cm kcr
- Advertisement -

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం అయిన‌ప్ప‌టికీ నిర్వహణలో తెలంగాణ శాసనసభ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది అని గుర్తు చేశారు.. రాష్ట్ర శాసనసభ మరింత స్ఫూర్తిమంతంగా నిలిచేందుకు కొత్తగా కొన్ని విధివిధానాలు, నిబంధనలు రూపొందించుకోవాల్సి ఉందని పిలుపునిచ్చారు.

సభలో ప్రవేశపెట్టే బిల్లులపై సభ్యులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా గానీ, వారికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఆ పద్ధతి కొనసాగుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఓ సభ్యుడు లేవనెత్తే అంశం ప్రజోపయోగమైనది అయితే కావల్సినంత సమయం కేటాయించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరవేయాల‌న్నారు. వర్షాకాల సమావేశాలను అక్టోబరు 5 వరకు జరపాలని నిర్ణయించారు.

- Advertisement -