జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం, ఎంపీ కవిత

207
justice-subhashan-reddy

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జిస్టిస్ సుభాషణ్ రెడ్డి ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈసందర్భంగా ఆయన మృతికి సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్. జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో సుభాషణ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

మరోవైపు సుభాషణ్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత .  ఆయనకు  ముగ్గురు సంతానం ఉన్నారు. ఆయన గతంలో కేరళ, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సుభాష్ రెడ్డి అంత్యక్రియలు జరుపునున్నారు.