రేవంత్ రెడ్డి రాజకీయ టెర్రరిస్టుః బాల్క సుమన్

261
Revanth Reddy Balka Suman

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్ట్ అని..ఆయన కూడా కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అసలు గ్లోబరినా సంస్ధకు కేటీఆర్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇంటర్ ఫలితాలపై ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు.

అసలు గ్గోబరినాకు ఇచ్చిన టెండర్ రూ.4కోట్లు అయితే వందల కోట్లు అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన బుద్ది ఎంటో అర్ధమవుతుందన్నారు. ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా ప్రజల సమస్యలకు సంబంధించినది లేదన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక శాడిస్టుగా మారాడని సుమన్‌ ధ్వజమెత్తారు. కొడంగల్‌లో ఓడిపోయినప్పటికీ ఆయనకు బుద్ధి రాలేదు. ప్రజల కోసం ఆయన ఏనాడు మాట్లాడలేదన్నారు. ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి తప్పులు చేసిన అధికారులపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని అని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ స్పష్టం చేశారు.