తిట్టినా నువ్వే.. కొట్టినా నువ్వే.. కేసీఆర్‌పై బాబు వ్యాఖ్యలు..!

159
CM KCR

సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం చేసి కేసీఆర్‌.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసినా సరే చంద్రబాబు మాత్రం మోడీపై పోరాటానికి కలిసొస్తామంటే రండి అని కేసీఆర్‌ను ఇన్‌డైరెక్ట్‌గా పిలుస్తున్నారు. ఇక కేసీఆర్‌ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకొని వైసీపీకి మద్దతు చేశాడని చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ పై గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే తాజాగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. తొలుత ఈ అంశంపై మాట్లాడే సమయం కాదన్న చంద్రబాబు అనంతరం తాము బీజేపీపై పోరాటం చేస్తున్నామని తమతో కలిసి పోరాటం చేసేందుకు ఏ పార్టీ కలిసి వచ్చినా స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.