రిజల్ట్స్‌ తర్వాత హరీష్‌ రావుకు గుడ్‌ న్యూస్‌..!

251
harish rao

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌గా పార్టీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నేత హరీష్ రావు. సీఎం కేసీఆర్ ఏ పని అప్పజెప్పినా విజయవంతంగా పూర్తిచేసే హరీష్‌..గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఉద్దండులను మట్టికరిపించడంలో కీ రోల్ పోషించారు. అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రివర్గంలో హరీష్‌కు ఛాన్స్‌ దక్కలేదు. దీంతో ఇక పార్టీలో హరీష్‌ పని అయిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.పలుమార్లు హరీష్‌ స్వయంగా దానిని ఖండించిన రూమర్లు మాత్రం ఆగడం లేదు.

ఈ నేపథ్యంలో హరీష్ రావుకు త్వరలోనే శుభవార్త అందనుంది. ఈ విషయాన్ని మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ స్పష్టం చేస్తున్నారు. త్వరలో హరీష్ తో పాటు మనందరికి మంచి శుభవార్త అందనుందని..హరీష్ అర్హతకు తగిన మంచి పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సిద్దిపేటలో ఇటీవల జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో వెల్లడించారు.

ఈ వార్తలకు నిజం చేకూరుస్తూ హరీష్‌కు రాష్ట్రంలో మంత్రివర్గంలో ఛాన్స్ లేదా కేంద్రంలో కీ రోల్‌ పోషించే బాధ్యతను అప్పజెప్పాలను ఆలోచనతో గులాబీ బాస్ ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తమ నేతకు ఈ సారి కేబినెట్‌లో బెర్త్ దక్కడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మొత్తంగా త్వరలోనే హరీష్‌ పార్టీలో కీలకంగా మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.