బాలకృష్ణకు జోడిగా కంచె హీరోయిన్

494
balakrishna
- Advertisement -

నందమూరి బాలకృష్ణ నటించిన రూలర సినిమా భారీ ప్లాప్ ను మూటగట్టుకుంది. దీంతో ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇటివలే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ విజయాలను సాధించాయి. దీంతో మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు బాలయ్య అభిమానులు. ఈ మూవీలో బాలకృష్ణను కొత్త గెటప్ లో చూపించబోతున్నారు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్.

Pragya-Jaiswal

ఈమూవీలో బాలయ్య అఘోరా పాత్రలోకూడా నటించనున్నాడని తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఈమూవీలో నటించే హీరోయిన్ పై క్లారిటీ రాలేదు. పలువురు హీరోయిన్లను సంప్రదిస్తున్నారు చిత్రయూనిట్. తాజాగాఉన్న సమాచారం మేరకు కంచె మూవీ హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. కంచె సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. చిన్న చిన్న సినిమాల్లో నటించిన అవి పెద్దగా విజయం సాధించలేదు. ఈమూవీకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

- Advertisement -