ఇంటర్‌లో టాపర్‌.. కానీ సన్యాసిగా మారాడు !

237
Class XII topper student become monk
Class XII topper student become monk
- Advertisement -

ఈ17 ఏళ్ల అహ్మదాబాద్ కుర్రాడి పేరు వర్షిల్ షా .. గుజరాత్ రాష్ట్ర బోర్డు నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో 99.99 మార్కులు సాధించాడు. ఇంటర్ లో 99.99 పర్సంట్ మార్కులు సాధిస్తే విద్యార్థులు ఏంచేస్తారు? మరింత ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలని ఆరాటపడతారు. అయితే వర్షిల్ మాత్రం సన్యాసం స్వీకరించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అత్యధిక మార్కులు సాధించినప్పటికీ… అందరిలాగా భూ సంబంధమైన ఆస్తులు సంపాదించడం నాకిష్టం లేదని వర్షిల్ స్పష్టం చేశాడు. ఆత్మ శాంతి, శాశ్వితమైన ఆనందం సంపాదించడమే తన లక్ష్యమని… తన వెనుక ఉన్నవాటిన్నిటినీ వదలేసి, జైన సన్యాసిగా మారినప్పుడే అది సాధ్యమని వర్షిల్ పేర్కొన్నాడు.

vershil shah

తల్లిదండ్రులిద్దరకీ మతపరమైన విశ్వాసాలు మెండుగా ఉండటం కూడా షా పై బాగా ప్రభావం చూపించాయని స్థానికులు చెబుతున్నారు. షా తండ్రి ఇన్ కంట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తుంటే, తల్లి హౌజ్ వైఫ్. టెన్స్ ప్లస్ టు పరీక్షలు రాసిన షా, తనకు ఎన్ని మార్కులొచ్చాయో కూడా వెళ్లి తెలుసుకోలేదట. వర్షిల్‌తో పాటు అతడి సోదరి జైనిని కూడా బాల్యం నుంచి అత్యంత నిరాడంబరంగా పెంచారనీ… ఆ కుటుంబానికి ఆథ్యాత్మిక భావాలు ఎక్కువట. మెరిట్ స్టూడెంట్ అయిన షా అక్క కూడా చార్టెడ్ అకౌంటెంట్ చదువుతూ మధ్యలోనే చదువు నిలిపివేసింది. ఆయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఇంట్లో కనీసం టీవీ, రిఫ్రిజిరేటర్ వంటివికూడా లేకపోవడం విశేషం. జీవులకు ఇబ్బంది కలగకుండా వర్షిల్ షా ఇంట్లో విద్యుత్ వాడకం కూడా చాలా తక్కువగా ఉపయోగిస్తారు.

- Advertisement -